Header Banner

కూతురి కారణంగా సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం? పోలీసుల విచారణలో ఏం బయటకు వచ్చిందంటే!

  Wed Mar 05, 2025 14:42        Cinemas

కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందా.. అసలెందుకు కల్పన నిద్రమాత్రలు అధికంగా మింగేసింది.. కుటంబంలో ఏవైనా గొడవలు ఉన్నాయా.. కూతురితో విభేదాలున్నాయా.. కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించిందా.. స్పందిస్తే ఏమంటోంది.. అసలు కల్పన కుటుంబంలో ఏం జరుగుతోంది.. పూర్తి వివరాలు మీకోసం..

 

ఇది కూడా చదవండి: జగన్‌కు స్పీకర్ వార్నింగ్! జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో హాట్ టాపిక్! ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రశ్నే లేదు...

 

తన కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ప్రచారం జరుగుతోంది. తన కూతురు తన మాట వినలేదనే కారణంగా మనస్తాపానికి గురైన కల్పన.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాలు, వార్తలపై కల్పన కూతురు తొలిసారి రియాక్ట్ అయ్యింది. కల్పన ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న ఆమె కూతురు.. హుటాహుటిన కేరళ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మరి పోలీసులకు కల్పన కూతురు ఏం చెప్పింది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించింది. తన తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపింది. నిద్రమాత్రలు ఓవర్ డోస్ వేసుకుందన్నారు. డాక్టర్ సూచించిన నిద్రమాత్రలే వేసుకుందని వివరించింది. మానసిక ప్రశాంతత కోసం నిద్రమాత్రలు వేసుకుంటోందని కల్పన కూతురు తెలిపింది. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదన్నారు. తన తల్లి కల్పన హైదరాబాద్‌లో లా పీజీ చేస్తోందని వివరించింది. కల్పన మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడేదని పేర్కొంది.


కల్పన పెద్ద కూతురు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అంతకుముందు.. కేరళ నుంచి హైదరాబాద్ రమ్మంటే కూతురు రావడం లేదని కల్పన మనస్థాపనం చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేరళ వెళ్లిన సందర్భంలో కూడా ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరిగాయట. హైదరాబాద్‌కి వచ్చిన తరువాత మరోసారి కూతురుని తన వద్దకు రావాలని కల్పన కోరిందట. అయినప్పటికీ ఆమె అంగీకరించలేద. దీంతో తన కూతురు తన మాట వినడం లేదని కల్పన మనస్తాపానికి గురైందని, అలా నిద్ర మాత్రలు వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కల్పన మొదటి భర్త కూతురు కేరళలో చదువుతోంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేయాలని కల్పన ఆమెను అనేకసార్లు కోరింది. ఈ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SingerKalpana #KalpanaSuicideAttempt #KalpanaDaughter #FamilyDispute #MentalHealthMatters #StressAndDepression #HyderabadNews #BreakingNews #TollywoodSinger #TruthBehindKalpanaCase